కంచె కు జాతీయ అవార్
'గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’
వంటి విభిన్న చిత్రాలను అందించిన దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందిన
చిత్రం ‘కంచె’. ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది కానీ
కమర్షియల్ గా సక్సెస్ ను సాధించలేకపోయింది. వరుణ్ తేజ, ప్రగ్యాజైస్వాల్
జంటగా నటించిన ఈ చిత్రం ఒక ఊరిలోని మనుషుల మధ్య వుండే కుల,మతాలు అనే కంచె
ఆధారంగా, కార్గిల్ అనే అంశాన్ని జతచేసి రూపొందించారు.
తాజాగా ఈ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా
ఎంపికయ్యింది. కేంద్రం ప్రకటించిన 63వ జాతీయ చిత్ర అవార్డులలో ‘బాహుబలి’కి
ఉత్తమ జాతీయ చిత్రం, ‘కంచె’ చిత్రానికి ఉత్తమ తెలుగు జాతీయ చిత్రంగా
అవార్డులు దక్కాయి. తను ఎంతో కష్టపడి తీసిన ‘కంచె’ చిత్రానికి జాతీయ
అవార్డు రావడం పట్ల దర్శకుడు క్రిష్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
అవార్డు సాధించే సత్తా ఉన్నప్పటికీ, ఈ
పురస్కారాన్ని తాను ఊహించలేదని మీడియాతో తెలిపారు. కానీ ఇప్పటివరకు తాను
చేసిన సినిమాల్లో ‘కంచె’ అత్యంత అసాధారణ చిత్రమని, దీనికోసం చాలా
కష్టపడ్డాడనని క్రిష్ చెప్పుకొచ్చారు. అలాగే తన రెండవ చిత్రానికే ఇలాంటి
ప్రయోగాత్మక కథాంశాన్ని ఎంపిక చేసుకొని నటించిన వరుణ్ తేజ ఖాతాలో ‘కంచె’
నిలిచిందని చెప్పుకోవచ్చు.
‘కంచె’ చిత్రానికి జాతీయ ఉత్తమ తెలుగు
చిత్రంగా అవార్డు రావడంతో వరుణ్ తేజ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి
చిత్రంలో ఒక భాగమైనందుకు దర్శకుడు క్రిష్ కు కృతజ్ఞతలు అంటూ వరుణ్ ట్వీట్
చేసాడు. మొత్తానికి రెండు తెలుగు చిత్రాలకు జాతీయ అవార్డుల రావడం
సంతోషకరమైన విషయమని చెప్పుకోవచ్
కంచె కు జాతీయ అవార్
Reviewed by newsreviews9
on
10:30 AM
Rating:
No comments: