సంతానం కోసం 15మంది వంటగాళ్ళు
తమిళనాట కమెడియన్ సంతానంకు
ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రీసెంట్‌గా హీరోగానూ తమిళ తంబీలను
మెప్పిస్తున్నాడు. తాజాగా 'సర్వర్ సుందరం' అనే చిత్రంలో సంతానం హీరోగా
నటిస్తున్నాడు. 1964లో మేటి హాస్యనటుడు నగేశ్ హీరోగా రూపొందిన 'సర్వర్
సుందరం' టైటిల్‌తోనే ఈ తాజా చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో నగేశ్ మనవడు
బిజేశ్ కూడా ఓ కీలకపాత్ర పోషిస్తూ ఉండడం విశేషం. ఆ రోజుల్లో నగేశ్ 'సర్వర్
సుందరం' విజయం సాధించడమే కాదు, నగేశ్‌కు విశేషమైన క్రేజ్‌ను సంపాదించి
పెట్టింది... అదే తీరున ఈ 'సర్వర్ సుందరం' కూడా సంతానంకు విశేషాదరణ
సంపాదిస్తుందని డైరెక్టర్ ఆనంద్ బాల్కీ నమ్మకం... అంతేకాదు ఈ సినిమా కోసం
సంతానంకు 15మంది ఫైవ్ స్టార్ చెఫ్స్‌తో ట్రైనింగ్ కూడా ఇప్పించారట. అలాగే ఈ
చిత్రంలో సంతానంకు సర్వర్ డ్రెస్ కుట్టించడంలోనూ పలువురు టైలర్స్‌ను
ఉపయోగించుకున్నారట. ఈ సినిమాలో సంతానం సరసన నాయికగా వైభవీ శాండిల్య
నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ గోవా, దుబాయ్, చెన్నై, తంజావూర్ లలో
సాగనుంది... వంటల చుట్టూ తిరిగే 'స్వరర్ సుందరం' కథలో ఫుడ్‌కు ఉన్న
ప్రాముఖ్యతను బట్టే ఎంతో కేర్ తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట...
సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
సంతానం కోసం 15మంది వంటగాళ్ళు
Reviewed by newsreviews9
on
10:15 AM
Rating:
No comments: